నాగర్ కర్నూల్ : జిల్లా ( Nagarkurnoor District ) కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో బుక్ సెంటర్ నిర్వహిస్తున్న భీంశెట్టి ప్రకాష్ (47) గత నెల రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య భీంశెట్టి ప్రసన్న (38) గురువారం మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు కూతురు మేఘన (13) కుమారుడు అశ్రీత్ రాం (15) కు అన్నంలో విషం ( Posion ) కలిపి పిల్లలకు తినిపించి ఆమె కూడా తిన్నది.
ప్రసన్న సోదరుడు ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా ముగ్గురు అచేతన స్థితిలో పడి ఉండడాన్ని గమనించి హుటాహుటినా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తల్లి, కూతురు మృతి చెందారు. కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.