They Call Him OG | టాలీవుడ్లో డిఫరెంట్ మ్యానరిజంతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అతి కొద్ది స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ స్టార్ యాక్టర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటిలో ఒకటి సుజిత్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ఓజీ (They Call Him OG). తాజాగా యువ హీరో కిరణ్ అబ్బవరం ఓజీ గురించి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఓ ఈవెంట్లో కిరణ్ అబ్బవరంమాట్లాడుతూ.. ఓజీ గురించి మాట్లాడుతూ సుజిత్ అన్నతో రెండుమూడు సార్లు అదే అడిగాను.. అన్న దయచేసి సినిమా వదలండి అన్నా.. మాకదే కావాలి.. ఓజీ టీజర్‌కే మతిపోయింది.. ఓజీతో థియేటర్లన్నీ అంతే ఇక పక్కాగా చెబుతున్నానన్నాడు. కిరణ్ అబ్బవరం కామెంట్స్‌తో మూవీ లవర్స్‌తోపాటు పవన్ కల్యాణ్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.
ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే లాంచ్ చేసిన ఓజీ HUNGRYCHEETAH గ్లింప్స్‌లో పూర్తిగా నయా అవతార్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఓజీలో పాపులర్ జపనీస్ నటుడు కజుకి కిటముర, ప్రముఖ థాయ్ యాక్టర్ Vithaya Pansringarm కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Actor @Kiran_Abbavaram about #TheyCallHIMOG 💥🔥pic.twitter.com/QvbopqXhdj
— Movie Threat (@MovieThreat) January 13, 2025
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Daaku Maharaaj | వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన ఫీట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?