కేజీఎఫ్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్తోపాటు గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు రవి బస్రూర్ (Ravi Basrur). ఈ స్టార్ మ్యూజిక్ కంపోజర్ హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ సినిమాకు కూడా సంగీతం అందించాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్‌కు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ స్టార్ కంపోజర్ ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్న పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసన సభ’ (Sasanasabha) సినిమాకు పని చేస్తున్నాడు.
వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నాడు. పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ కు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మ్యాజిక్ చేయబోతున్నాడంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని సాప్‌బ్రో ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మిస్తున్నారు.
రవి బస్రూర్ గురించి నిర్మాత షణ్ముగం సప్పని మాట్లాడుతూ..’అవుట్ పుట్ అద్బుతంగా వచ్చింది. అతడి మ్యూజిక్, రీరికార్డింగ్ అసాధారణ స్థాయిలో ఉన్నాయి. కేజీఎఫ్ లాంటి గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా తర్వాత రవి బస్రూర్ ఈ చిత్రానికి మంచి అవుట్ పుట్ ఇస్తున్నాడు. రవిబస్రూర్ ఈ చిత్రానికి పనిచేయడం చాలా ఎక్జయిటింగ్‌గా ఉందని అన్నారు. శాసనసభ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్-రీరికార్డింగ్ కీ పిల్లర్స్ అని చెప్పారు.
ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రంలో నాలుగు పాటలుండబోతున్నాయి. హెబా పటేల్‌పై వచ్చే ఓ పాటను మంగ్లీ పాడింది. రవిబస్రూర్-మంగ్లీ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. రాఘవేంద్రరెడ్డి ఈ చిత్రానికి కథనందిస్తున్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ భకుని, రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్విరాజ్, జబర్దస్థ్ అప్పారావు, అనీష్ కురువిల్ల, అమిత్ కీ రోల్స్ చేస్తున్నారు.