శుక్రవారం 10 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 11:33:24

కేజీఎఫ్ 2 పుకార్ల‌ని ఖండించిన చిత్ర బృందం

కేజీఎఫ్ 2 పుకార్ల‌ని ఖండించిన చిత్ర బృందం

లాక్‌డౌన్ వ‌ల‌న గ‌త రెండు నెల‌లుగా సినిమా షూటింగ్స్‌, థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో సినీ ప్రేక్ష‌కులే కాక ద‌ర్శ‌క నిర్మాతలు కూడా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల వైపు దృష్టి సారించారు. ఇప్ప‌టికే  తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కి సంబంధించిన ప‌లు చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫాంస్‌లో విడుద‌ల‌య్యాయి. తాజాగా క‌న్న‌డ సూప‌ర్ హిట్ చిత్రం కేజీఎఫ్ 2 కూడా ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ చిత్రం కేజీఎఫ్‌. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న కేజీఎఫ్ 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేసేందుకు రంగం సిద్ద‌మ‌వుతుందని పుకార్లు వ‌చ్చాయి. అమెజాన్ ప్రైమ్,  కేజీఎఫ్ 2కి మ‌ధ్య భారీ డీల్ కుద‌ర‌డంతో ఇది సాధ్య‌మైంద‌ని అన్నారు. తాజాగా ఈ వార్త‌ల‌ని ఖండించిన ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఓటీటీలో కేజీఎఫ్ 2లో విడుద‌ల చేసే ఛాన్స్ ఏ మాత్రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఫ‌ర్హాన్ కేజీఎఫ్ 2 చిత్రాన్ని హిందీలో విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే

 


logo