Raghu Thatha | నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ రఘు తాతా (Raghu Thatha). సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రఘు తాతా నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ నెటిజన్లను ఇంప్రెస్ చేస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. నీవెందుకు అమ్మాయిలా సరిగ్గా డ్రెస్ వేసుకోలేదని కీర్తిసురేశ్‌ను అడుగుతుంటే.. సరైన అమ్మాయి కాబట్టే నాకు ఆసక్తి లేదంటోన్న డైలాగ్స్‌తో షురూఅయింది ట్రైలర్.
మొదట అమ్మాయిలా ఎలా ప్రవర్తించాలో నేర్చుకో అని కీర్తిసురేశ్‌కు ఉన్నతాధికారి చెప్తున్నాడు. మరోవైపు రవీంద్ర విజయ్, కీర్తిసురేశ్ లవ్ ట్రాక్‌తోపాటు కీర్తిసురేశ్ హిందీ నేర్చుకునే సన్నివేశాలతో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. హిందీ రాని తమిళ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే నేపథ్యంలో ఆసక్తికరంగా ట్రైలర్‌ని కట్ చేశాడు.
మరోవైపు కీర్తి సురేశ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో క్యాడెట్ శిక్షణ పొందుతున్న సీన్లతో షురూ అయిన టీజర్లో NCC మాస్టర్ హిందీలో శిక్షణ ఇస్తుండగా.. నాకు హిందీ రాదు తమిళంలో చెప్పండి సార్ అంటోంది కీర్తిసురేశ్. హిందీ పరీక్ష రాస్తేనే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అంటే దాన్ని కీర్తి సురేశ్ తిరస్కరిస్తుంది. రఘుతాతా తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ తిరుగనున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ మూవీని కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ ప్రాంచైజీలను తెరకెక్కించిన పాపులర్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కిస్తోండంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి షాన్ రోల్డన్ సంగీతం అందిస్తున్నాడు.
రఘు తాతా ట్రైలర్..
Catch the excitement and laughter. Dive into the fun with a new twist!
Presenting #RaghuThathaTrailer to you all!
🔗 https://t.co/hVEockVI5X#RaghuThatha worldwide grand release on August 15th!@KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan… pic.twitter.com/BKjlSi3fR0— Hombale Films (@hombalefilms) July 31, 2024
Double iSmart | మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో రామ్ డబ్బింగ్
Game Changer | బర్త్ డే గాళ్ కియారా అద్వానీకి శుభాకాంక్షలు.. ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ నయా లుక్
They Call Him OG | ఏంటీ పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం వచ్చేసిందా..? ఓజీ షూట్‌పై క్రేజీ న్యూస్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్