సంగారెడ్డి, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది (2025) నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. గత ఏడాది పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది ఒక్కశాతం నేరా లు తగ్గాయి. నేరాలకు సంబంధించి 2023లో 7236 కేసులు నమోదు కాగా, గతేడాది 8344 , ఈఏడాది 8255 కేసులు నమోదయ్యాయి. తీవ్రనేరాల సంఖ్య గతేడాది 323 ఉండగా, ఈ ఏడాది 235 నమోదయ్యాయి. గతేడాది 8021 సాధారణ కేసులు, ఈ ఏడాది 8020 కేసులు, గతేడాది గంజాయి కేసులు 26 నమోదు కాగా, ఈ ఏడాది 37 కేసులు, అల్ఫాజోలం కేసులు రెండు, గంజాయి సాగు కేసులు నాలుగు నమోదయ్యాయి. మొత్తం 43 కేసులు నమోదు కాగా, 88 మంది అరెస్ట్ అయ్యారు. గతేడాది 522 కేజీల గంజాయి సీజ్ చేయగా, ఈఏడాది 791 కేజీల గంజాయిని సీజ్ చేశారు.
మహిళలపై పెరిగిన నేరాలు
ఈ ఏడాది మహిళలపై నేరాల సంఖ్య పెరిగిం ది.రెండేండ్ల్లలో వరకట్నం కోసం హత్య కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఈ ఏడాది ఒక కేసు నమోదైంది. వరకట్నం వేధింపులతో గతేడాది ఆరుగురు, ఈ ఏడాది తొమ్మిది మంది మరణించారు. గతేడాది భర్తవేధింపుల కేసులు 136 నమోదు కాగా, ఈఏడాది 143 నమోదయ్యాయి. లైంగికదాడి కేసులు గతేడా ది 131, ఈ ఏడాది 125 నమోదయ్యాయి. మహిళల అపహరణ కేసులు గతేడాది 75 , ఈ ఏడాది 125 నమోదయ్యాయి. మహిళలను అవమానపర్చిన కేసులు గత ఏడాది 98, ఈఏడాది 103 నమోదయ్యాయి.
పెరిగిన కిడ్నాప్, అదృశ్యం కేసులు
జిల్లాలో కిడ్నాప్‌లు 39శాతం మేర పెరిగాయి. 2023లో జిల్లాలో కిడ్నాప్ కేసులు 41, 2024లో 90 నమోదయ్యాయి. ఈ ఏడాది జిల్లాలో 125 కిడ్నాప్ కేసులు నమోదయ్యా యి. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో కిడ్నాప్ కేసులు 39 శాతం పెరిగాయి. గతేడాది జిల్లా లో 874 అదృశ్యం కేసులు నమోదు కాగా, ఈఏడాది 959 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1051 మంది మహిళలు, పురుషులు అదృశ్యం కాగా, 894 మంది ఆచూకీని పోలీసులు కొనుగొన్నారు. గతేడాది జిల్లాలో 60 , ఈ ఏడాది 41 హత్య కేసులు నమోదయ్యాయి. ఆస్తికోసం హత్యలు గతేడాది 11 జరగగా, ఈఏడాది తొమ్మిది జరిగాయి.
గతేడాది ఒక బందిపోటు దొంగతనం కేసు నమోదు కాగా, ఈ ఏడాది రెండు నమోదయ్యాయి. దోపిడీ కేసులు గతేడాది 36, ఈ ఏడాది 24 నమోదయ్యాయి. రాత్రిపూట దొంగతనాల కేసులు గత ఏడాది 215 ఈఏడాది 214 నమోదయ్యాయి. సాధారణ దొంగతనాల కేసులు గతేడాది 639 ఈ ఏడాది 214 కేసులు నమోదయ్యాయి. గొలుసు దొంగతనాలు గతేడాది 21, ఈ ఏడాది 18 కేసులు నమోదయ్యాయి. దొంగతనాల కేసు లు రికవరీ శాతం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 64 శాతం పెరిగింది. గతేడాది దొంగతనాల కేసుల్లో 3.97 కోట్లు, ఈ ఏడాది రూ.7.33 కోట్లు రికవరీ చేశారు. జిల్లాలో గతేడాది 198, ఈ ఏడాది 168 చీటింగ్ కేసులు నమోదయ్యాయి.
16,326 డ్రంకన్ డ్రైవ్ కేసులు
వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి గతేడాదితో పోలిసే ఈ ఏడాది పోలీసులు అధిక సంఖ్యలో కేసులు నమోదు చేశారు. గతేడాది జిల్లాలో వాహనాల తనిఖీ సమయంలో పోలీసులు 2,06,687 కేసులు నమోదు చేసి రూ.7,58,48,351 జరిమాన విధించారు. ఈ ఏడాది వాహనాల తనిఖీల్లో పోలీసులు 3,25,660 కేసులు నమోదు చేశారు. గతేడాదితో పోలిస్తే 1,18,973 కేసు లు అధికంగా నమోదు చేశారు. ఈ ఏడాది మొత్తం రూ.10,82,17,328 జరిమాన విధించారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువగా నమోదు చేశారు. గతేడాది 10216 డ్రంకన్‌డ్రైవ్ కేసులు నమో దు చేసి రూ.1.31 కోట్ల జరినాన విధించారు. 39 మందికి జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది జిల్లాలో 16,326 డ్రంకన్‌డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
ఇందుకు సంబంధించి పోలీసులు రూ.1,85,90,315 జరిమాన విధించగా 65 మందికి జైలు శిక్ష పడింది. గత ఏడాది పోలీస్తే ఈ ఏడాది 6110 డ్రంకన్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడా ది సైబర్ క్రైమ్ కేసులు తీగ్గాయి. గత ఏడాది 793 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది పోలీసులు 490 కేసులు నమోదు చేశారు. గత ఏడాది జిల్లాలో 958 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదు కాగా ఈ ఏడాది 917 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య 2.3 శాతం తగ్గింది.