Raghu Thatha | మహానటి సినిమాతో తెలుగు, తమిళంతోపాటు హిందీలో సూపర్ ఫేం సంపాదించుకుంది నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఈ భామ లీడ్ రోల్లో నటించిన సినిమా రఘు తాతా (Raghu Thatha). సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళ ప్రజలపై హిందీని రుద్దే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఆ తర్వాత ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈ చిత్రాన్ని థియేటర్, ఓటీటీలో మిస్సయిన వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. రఘు తాతా తెలుగు వెర్షన్ పాపులర్ జీ తెలుగు ఛానల్లో అక్టోబర్ 20న మధ్యాహ్నం 3 గంటలకు ప్రీమియర్ కానుంది. మరి ఈ సినిమాకు టెలివిజన్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.
ఈ చిత్రం కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ ప్రాంచైజీలను తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చింది. రఘుతాతా ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫాం జీ5లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి షాన్ రోల్డన్ సంగీతం అందించాడు.
Mimmalni kuda evaraina ila pelli gurinchi adigithe em chestharo comment cheyyandi 😃👇#RaghuThatha ఈ ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు Only on #ZeeTelugu#WorldTelevisionPremiere #RaghuThathaOnZeeTelugu pic.twitter.com/TZiyKcsg6H
— ZEE TELUGU (@ZeeTVTelugu) October 16, 2024
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్