సోమవారం 25 మే 2020
Cinema - Mar 26, 2020 , 08:28:31

చీపురు పట్టిన క‌త్రినా కైఫ్‌..

చీపురు పట్టిన క‌త్రినా కైఫ్‌..

మ‌న ఇంట్లో ప‌ని మ‌నం చేసుకోవ‌డానికి అస్స‌లు నామోషీ ప‌డ‌నక్క‌ర్లేదు. సొంత ప‌నిని సంతోషంగా చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. తాజాగా ఆ కిక్‌ని తెగ ఎంజాయ్ చేస్తుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్‌. క‌రోనా కార‌ణంగా కొద్ది రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన క‌త్రినా కైఫ్ ఇటీవ‌ల ఇంట్లో పాత్ర‌ల‌ని క‌డిగింది. తాజాగా చీపురు ప‌ట్టి రూంని క్లీన్ చేసింది. ఇలా చేయ‌డం మంచి ఎక్సర్‌సైజింగ్‌గా ఉంటుంద‌ని అంటుంది క్యాట్‌. ఇక చీపురుతో ఊడ‌వ‌డ‌మే కాదు క్రికెట్ కూడా ఆడ‌వ‌చ్చని చూపించింది. ప్ర‌స్తుతం క‌త్రినా చీపురు ప‌ట్టి ఊడ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారింది.logo