రెండు మూడు రోజులుగా సస్పెన్స్ లో ఉన్న కార్తికేయ 2 (Karthikeya 2) రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. నిఖిల్ (Nikhil Siddharth) హీరోగా వస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి (Chandoo Mondeti) తెరకెక్కించాడు. శ్రీకృష్ణుడి తత్వం బోధిస్తూ.. ఆయన గురించి.. చెబుతూ సముద్ర గర్భంలో దాగున్న కృష్ణుడి చరిత్రను ఆధారంగా చేసుకొని కార్తికేయ సీక్వెల్ తెరకెక్కించాడు చందు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఒకేరోజు విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ రావడంతో.. దాన్ని ఉపయోగించుకోవడానికి నిఖిల్ మాస్టర్ ప్లాన్ వేశాడు. శ్రీకృష్ణుడి జీవితం అంటే కచ్చితంగా మన దగ్గర కంటే నార్త్ లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా ఈ సినిమాకు ఇస్కాన్ సంస్థల (ISKCON Organization) నుంచి కావాల్సినంత సపోర్ట్ ఉంది.
బృందావన్‌లో ప్రమోషన్..
ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానమైన మధురలోని బృందావన్ కి వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు కార్తికేయ 2 యూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయడానికి ప్రత్యేకంగా కారణాలు కూడా ఉన్నాయి. ముందు కార్తికేయ సీక్వెల్ ఆగస్టు 5న విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. కాకపోతే ఆ రోజు బింబిసార, సీతారామం సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి.
ఈ రెండు సినిమాలకు పోటీగా కార్తికేయ కూడా వస్తే థియేటర్స్ విషయంలో చాలా గందరగోళం జరుగుతుంది. ఆగస్టు 12న వస్తే ఎక్కువ థియేటర్స్ ఇస్తామంటూ నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు చెప్పడంతో రిలీజ్ డేట్ మార్చుకోక తప్పలేదు. ఆగస్టు 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా ఉన్నా కూడా.. కార్తికేయకే ఎక్కువగా థియేటర్లు వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ దీనికి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ కూడా బాగానే రావచ్చు అని ట్రేడ్ పండితుల అంచనా. మొత్తానికి కార్తికేయతో నిఖిల్ మరోసారి మ్యాజిక్ చేస్తాడా లేదా చూడాలి. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించారు.
The Epic Mystical Movie #Karthikeya2 had a Magical Experience at ISKCON Brindavan.
Powerful Facts Were Spoken By The Spokesperson of #ISKCON Radharam Das ji thanking The team for bringing out the True Facts and glory of Lord Sri Krishna in the Movie. https://t.co/ndgFLD5OPC pic.twitter.com/20gUD4WOvB— Nikhil Siddhartha (@actor_Nikhil) July 19, 2022
The Epic Mystical Movie #Karthikeya2 had a Magical Experience at ISKCON Brindavan.
Powerful Facts Were Spoken By The Spokesperson of #ISKCON Radharam Das ji thanking The team for bringing out the True Facts and glory of Lord Sri Krishna in the Movie. https://t.co/ndgFLD5OPC pic.twitter.com/20gUD4WOvB— Nikhil Siddhartha (@actor_Nikhil) July 19, 2022