కోవిడ్ సంక్షోభం (pandemic time) అతలాకుతలం చేస్తున్న సమయంలో బిక్కుబిక్కుమంటూ అవస్థలు పడుతున్న నిరాశ్రయులకు నేనున్నానంటూ ముందుకొచ్చాడు. వేలాది మందికి అవసరాలు తీర్చి రియల్‌హీరోగా మారిపోయాడు సోనూసూద్ (Sonu Sood). రీల్ లైఫ్‌లో విలన్‌గా భయపట్టించే సోనూసూద్ రియల్ లైఫ్‌లో ఆపదలో ఉన్నవారికి తనవంతుగా సాయం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.
తన సామాజిక సేవతో కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. లేటెస్ట్గా కరీంనగర్‌కు చెందిన 7 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ (కాలేయ మార్పిడి చికిత్స) (liver transplant surgery)కి సాయం చేశాడు. సదరు చిన్నారికి వైద్యులు విజయవంతంగా సర్జరీ పూర్తి చేయగా..పాప ఆరోగ్యంగా ఉంది.
తన పౌండేషన్ ద్వారా ఈ వైద్యాన్ని అందించాడు సోనూసూద్. ఇప్పటికే Sood Charity Foundation ఫౌండేషన్ ద్వారా వేలాదిమందికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. సోనూసూద్ ఈ ఏడాది తెలుగులో చిరంజీవి నటించిన ఆచార్యలో నటించాడు.