ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు స్టేజీపై ఊర మాస్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది..మాంచి కిక్కించేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇపుడలాంటి వీడియోనే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ స్టార్లు ఎవరనే కదా మీ డౌటు. బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ఈ ఇద్దరు హాట్ స్టార్ షో కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) 7వ ఎపిసోడ్లో సందడి చేశారు.
ఇప్పటికే ఓ ప్రోమో విడుదల చేయగా వైరల్ అవుతోంది. పుష్ప సినిమాలో సమంత డ్యాన్స్ చేసిన ఊ అంటావా మామ సాంగ్‌కు అక్షయ్ తో కలిసి (Sam Akshay dance) ఈ షోలో మరోసారి అదిరిపోయే స్టెప్పులేసి అదరగొట్టేసింది. ది కూల్ అండ్ ది కిల్లర్..హౌస్‌లో సెగలు రేపుతున్నారు..అంటూ వీడియో షేర్ చేస్తూ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది డిస్నీ హాట్‌స్టార్. ఇప్పుడీ కలర్ ఫుల్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఈ షో ఫన్నీ టాస్క్‌లు, గేమ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌తో సందడిగా సాగిందని ఇప్పటివరకు వచ్చిన వీడియో అప్డేట్స్ చెబుతున్నాయి. ఈ ఎపిసోడ్ జులై 21 (గురువారం)న సాయంత్రం 7 గంటలకు హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది.