Fouja | హైదరాబాదీ యాక్టర్ కార్తీక్ దమ్ము, ఐశ్వర్యా సింగ్, పవన్ మల్హోత్రా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఫౌజా (Fouja). ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ హర్వాన్వీ చిత్రం మూడు జాతీయ అవార్డులు అందుకుంది. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని తెలుగు కూడా విడుదల చేయబోతున్నారు. నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో తెలుగు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ..సినిమాకు భాషా సరిహద్దులుండవని.. ఇలాంటి సినిమాకు భాషతో సంబంధముండదని అన్నాడు. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రాన్ని చూసి అందరూ ఎంజాయ్ చేయాలని సూచించాడు.
డబ్బులెన్ని ఉన్నా బ్రాండెడ్ బట్టలను కొనగలం.. కానీ ఇండియన్ ఆర్మీ యూనిఫాంను మాత్రం కొనలేం. దాన్ని కష్టంతో, ఇష్టంతో మాత్రమే సాధించుకోవాలి. దేశం అంటే ప్రేమ, భక్త ఉన్న ప్రతీ ఒక్కరికీ ఫౌజా నచ్చుతుందని డైరెక్టర్ ప్రమోద్ కుమార్ అన్నాడు. ఈ చిత్రాన్ని రాహి ప్రొడక్షన్స్-పీకే ప్రొడక్షన్ సమర్పణలో అజిత్ దాల్మియా తెరకెక్కించారు. ఈ చిత్రానికి యుగ్ భూషల్ సంగీతం అందించాడు.
Vijay | నటుడు విజయ్ తొలి సభకు భారీ జన సందోహం
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?