Karthi Na peru shiva 2 | టాలీవుడ్లో కొందరు తమిళ హీరోలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్య, విశాల్ వంటి స్టార్స్‌కు అయితే సపరేట్ మార్కెట్ కూడా ఉంది. వాళ్ల మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి అప్పుడప్పుడు వాళ్లు నటించిన పాత సినిమాలను కూడా డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కోలీవుడ్ హీరో కార్తి ఫాలోయింగ్‌ను యూజ్ చేసుకుని ఆయన నటించిన ఒక పాత సినిమాను ఇప్పుడు తీసుకొస్తున్నారు. నా పేరు శివ 2 పేరుతో వస్తున్న ఈ సినిమా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
కార్తి కెరీర్ మొదట్లో కీలక విజయాన్ని అందుకున్న సినిమా నాన్ మహాన్ అల్ల. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా 2010లో నా పేరు శివ పేరిట తెలుగులో రిలీజ్ అయింది. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్. కార్తితో యుగానికి ఒక్కడు, ఆవారా సినిమాలు నిర్మించిన స్టూడియోగ్రీన్ బ్యానర్‌పై కె ఇ జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. కార్తిని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఈ సినిమాను నిర్మించిన స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై గతంలో వచ్చిన ఒక సినిమా ఇప్పుడు నా పేరు శివ 2 టైటిల్‌తో వస్తుంది. ఆ సినిమానే మద్రాస్. కబాలి, సార్పట్ట పరంపర వంటి సినిమాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు. కేథరిన్ కథానాయికగా నటించింది. 2014లో వచ్చిన ఈ సినిమాకు కార్తి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్, సైమా అవార్డులు కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం నా పేరు శివ 2గా తీసుకొస్తున్నారు. జనవరిలోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి అప్పుడెప్పుడో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?
సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలు.. అందరూ స్టార్ హీరోలే..
Pushpa in OTT | RRR డేట్‌ను బ్లాక్ చేసిన పుష్ప.. ఓటీటీలో వచ్చేది అప్పుడే
ట్రిపుల్ ఆర్ బాటలోనే రాధేశ్యామ్.. ఫిల్మ్ రిలీజ్ వాయిదా
షణ్ముఖ్ బాటలోనే సిరి కూడా.. బ్రేకప్ దిశగా అడుగులు..