Actor Darshan | రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన ప్రముఖ కన్నడ హీరో దర్శన్ పరిస్థితి దారుణంగా మారినట్లు తెలుస్తోంది. తనకు జైలు ఫుడ్ పడట్లేదని ఇంటి నుంచి ఆహారం కావాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైలులో ఫుడ్ వలన డయేరియాతో బాధపడుతున్నానని ఫుడ్‌తో పాటు బెడ్, పుస్తకాలు కూడా కావాలని తన పిటిషన్లో కోరాడు. అయితే ఈ పిటిషన్‌ను విచరించిన కోర్టు ఖైదీలకు అందరికీ నిబంధనలు ఒకేలా ఉంటాయని తెలిపింది. అలాగే ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని పేర్కొంది. ఇక దర్శన్ ఇచ్చిన పిటిషన్‌పై జైలు అధికారులు, పోలీసులు, ప్రభుత్వానికి జస్టిస్ ఎస్ఆర్ శివకుమార్ నోటీసులు జారీ చేశారు. అనంతర ఈ విచారణను వాయిదా వేసింది
మరోవైపు, దర్శన్ తరపు న్యాయవాది తమ వాదనాలు వినిపిస్తూ.. దర్శన్‌కు జైలు ఫుడ్ పడట్లేదని పేర్కొన్నారు. దీంతో, విరేచనాల బారినపడ్డారని తెలిపారు. ఇది ఇలానే కొనసాగితే అతడి ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుదని అన్నారు. అలాగే జైళ్ల చట్టం 1963లోని సెక్షన్ 30 ప్రకారం ఖైదీలకు బయటి ఆహారం, దుస్తులు, బెడ్ అనుమతించొచ్చని అన్నారు. ఈ కేసులో దర్శన్ ఇంకా దోషిగా తేలని విషయాన్ని కూడా ప్రస్తావించారు. దర్శన్ పిటిషన్లో ఉన్నవి అనుమతిస్తే ప్రభుత్వం ఖర్చు కూడా తగ్గుతుందని వెల్లడించాడు.
Also Read..
“Darshan wife | ఆమె దర్శన్ భార్య కాదు.. పవిత్రాగౌడపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి”
“Hero Darshan | ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్.. జైలులో అడుక్కుంటున్న కన్నడ హీరో దర్శన్”