Darshan | పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan)ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసులో దర్శన్‌ను మైసూరులోని తన ఫాంహౌస్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తాజా ఈ కేసులో రేణుకాస్వామి డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు వినియోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు.
సీసీటీవీ పుటేజ్ ఆధారంగా రెడ్ స్కార్పియో కారు దర్శన్‌దేనని పోలీసులు నిర్దారణకు వచ్చినట్టు సమాచారం. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధింపులకు గురిచేసినందు వల్లే రేణుకాస్వామి హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. రెండు నెలల క్రితం చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని మైసూరులోని దర్శన్ ఫాంహౌస్‌కు పిలిపించుకున్నారని, అక్కడే అతడిని హింసించి చంపేసిన అనంతరం కామాక్షిపాల్యలోని కుంటలో మృతదేహాన్ని పడేశారని చెబుతున్నారు.
చిత్రదుర్గలో నమోదైన మిస్సింగ్ కేసు ఫిర్యాదులో భాగంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా.. విచారణలో ఆర్థిక సమస్యల కారణంగానే రేణుకాస్వామిని హత్య చేశామని ముగ్గురు వ్యక్తులు లొంగిపోయారు. ఈ కేసు తదుపరి విచారణలో భాగంగా దర్శన్ పేరు తెరపైకి రాగా.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేణుకాస్వామి పవిత్రగౌడకు అభ్యంతరకర మెసేజ్‌లు పంపి వేధింపులకు గురిచేయడమే ఈ హత్యకు దారితీసినట్టుగా ఇప్పటివరకు వచ్చిన కథనాలు చెబుతున్నాయి.
Respect to the police,they are connecting the dots very quickly🔥
Police seized the vehicle of #Darshan, which was seen in the CCTV footage!#MurderCase #RenukaSwamy pic.twitter.com/LAr73BQQ3r
— 𝔸𝕒𝕕𝕚 𝕊𝕦𝕕𝕖𝕖𝕡𝕚𝕒𝕟 (@AadiSudeepian) June 12, 2024
In #Bengaluru: CCTV footage from near the spot where 33-year-old Renukaswamy’s body was found shows Kannada film actor #Darshan’s Jeep (red colour) following the Scorpio that was reportedly used for dumping the body. pic.twitter.com/wOpm5sxq7I
— TOI Bengaluru (@TOIBengaluru) June 12, 2024