Thug life | ఉలగనాయగన్ కమల్‌హాసన్ (Kamalhaasan) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug life). లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో KH234 ప్రాజెక్టుగా వస్తోన్న థగ్ లైఫ్‌లో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
నేటితో థగ్ లైఫ్ షూటింగ్ పూర్తయింది. అంతేకాదు ఈ మూవీ డిజిటల్ రైట్స్ రూ.149.7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ మొత్తం కోలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. థగ్ లైఫ్ చిత్రాన్ని 2025 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కమల్ హాసన్ క్రేజ్ ఎలా రేంజ్లో ఉందో తాజా వార్త మరోసారి చెప్పకనే చెబుతోంది.
కొత్త ఆరంభ సమయం.. కొత్త థగ్ (క్రిమినల్)కు స్వాగతం పలికే సమయం.. అంటూ మేకర్స్ షేర్ చేసిన శింబు Sigma Thug Rule వీడియో ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. మణిరత్నం టీం ఇప్పటికే థగ్ లైఫ్ టీంతో డిజైన్ చేసిన వీడియో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#ThugLife : Benchmark Film⭐️
• Biggest Ever Digital Deal in the History Of Kollywood🤯
• Full Shoot Gets Wrap Today🔥
• Summer 2025 Release Plans!!#KamalHaasan | #SilambarasanTR | #Trisha | #ARRahman | #ManiRatnam— Saloon Kada Shanmugam (@saloon_kada) September 20, 2024
🔥 #ThugLife sets a new record with the biggest digital deal in Kollywood history—sold for a massive ₹149.7 Cr! 🤯
✅Shoot wraps up today, and the film is set for an epic Summer 2025 release! 🌟 #KamalHaasan | #SilambarasanTR | #Trisha | #ARRahman | #ManiRatnam pic.twitter.com/R42fmLHi71
— Kollywood Now (@kollywoodnow) September 20, 2024
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్‌ను అలా కలిశారో లేదో.. ఇలా హరిహరవీరమల్లు షూట్ షెడ్యూల్
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?