Kamal Haasan Next Movie | విశ్వనాయకుడు కమల్‌హాసన్ ప్రస్తుతం ‘విక్రమ్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. కేవలం తమిళంలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తమిళంలో ‘బాహుబలి-2’ రికార్డును చెరిపేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు రూ.450కోట్లకు పైగానే కలెక్షన్లను సాధించింది.
ఇదిలా ఉంటే కమల్ ఈ చిత్రం తర్వాత మహేష్ నారాయణ్‌తో సినిమా చేయనున్నాడు. ఈ కేరళ దర్శకుడు గతంలో ‘టేక్ ఆఫ్’, ‘సీ యూ సూన్’, ‘మాలిక్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. దీనితో పాటుగా కమల్ ‘ఇండియన్-2’ను పూర్తి చేసేపనిలో ఉన్నాడు. ఇప్పటికే ఇండియన్-2, 30శాతం షూటింగ్ పూర్తైంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని కమల్ భావిస్తున్నాడట. ప్రస్తుతం శంకర్, రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. RC15 తర్వాతే ఇండియన్-2 మళ్ళీ మొదలు కానుంది. అయితే ఈ లోపు కమల్ మరో సినిమాను పూర్తి చేయాలని భావించాడట. దాంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా.రంజీత్తో చేతులు కలిపాడు.
‘మద్రాస్’, ‘కబాలి’, ‘కాలా’ వంటి సినిమాలతో కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పా.రంజిత్. ఇటీవలే ‘సార్పట్ట పరంపర’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు. ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈయన చియాన్ విక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. విక్రమ్61 తర్వాత పా.రంజిత్, కమల్ హాసన్‌తో సినిమా చేయనున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను మొదలు పెట్టినట్లు త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు వెల్లడించాడు. మధురైలోని గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్.
Read Also:
RRR Movie | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ‘డాక్టర్ స్ట్రేంజ్’ దర్శకుడి ప్రశంసలు
Vikram61 | గ్రాండ్‌గా లాంఛ్ అయిన విక్రమ్ నెక్స్ట్ సినిమా.. వైరల్ అవుతున్న వీడియో
Kiran Abbavaram | బాలీవుడ్ స్టార్ హీరోతో పోటీ పడనున్న కిరణ్ అబ్బవరం?
Keerthy Suresh | కీర్తిసురేష్‌కు ఆ స్టార్ హీరో నటనంటే చాలా ఇష్టమట?