అచ్చంపేట రూరల్, మార్చి 6 : వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం వివిధ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించారు. వీరికి ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు.
మార్కెట్ అధికారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై పల్లి రైతులకు మంచి ధర దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని బలవంతంగా ఆందోళన విరమింపజేశారు.