Scott Derrickson Praises RRR Movie | ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన మరో దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ‘బాహుబలి-2’ పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి తన పేరిట లిఖించుకుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి మాయ చేశాడు. ఈ చిత్రంతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ సాధించింది.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మే 20నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రైమ్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులు సృష్టించింది. ట్రిపుల్ఆర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో వరుసగా మూడు వారాల పాటు అత్యధికంగా వీక్షించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రంపై హాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నటులు, టెక్నీషియన్లు సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా మరో హాలీవుడ్ స్టార్ దర్శకుడు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు.
‘డాక్టర్ స్ట్రేంజ్’ సినిమా గురించి తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. మార్వెల్ కామిక్స్‌లో డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాన్ని స్కాట్ డెర్రిక్సన్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ దర్శకుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ‘గతరాత్రి నా పుట్టినరోజును నా భార్య పిల్లలతో కలిసి జరుపుకున్నాను, వారితో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను చూశాను. ఆర్ఆర్ఆర్ సినిమా నాకు చాలా నచ్చింది. ఈ సినిమా ఒక అద్భుతమైన రోలర్‌కోస్టర్’ అంటూ ట్రిపుల్ఆర్ చిత్రాన్ని ప్రశంసించాడు.
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు.
To celebrate my birthday last night, my wife, kids and I watched @RRRMovie — what an awesomely outrageous roller coaster of a movie. Loved it. pic.twitter.com/90U7AXJPgd
— N O S ⋊ Ɔ I ᴚ ᴚ Ǝ ᗡ ⊥ ⊥ O Ɔ S (@scottderrickson) July 16, 2022
Read Also:
Liger Movie | విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?
Agent Movie | ‘ఏజెంట్’ టీజర్‌పై మహేష్‌బాబు ప్రశంసలు.. థాంక్యూ బ్రదర్ అంటూ అఖిల్ రీట్వీట్
Sita Ramam Movie | సిరివెన్నెల రచించిన ‘కానున్న కళ్యాణం’ ప్రోమో రిలీజ్
Keerthy Suresh | కీర్తిసురేష్‌కు ఆ స్టార్ హీరో నటనంటే చాలా ఇష్టమట?