Liger Trailer Update | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ బజ్తోనే ‘లైగర్’ నాన్ థియేట్రికల్ హక్కులు రూ.99కోట్లకు అమ్ముడయ్యాయి. టైర్-2 హీరోకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం విశేషం అనే చెప్పాలి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో లైగర్ టీం అప్డేట్లను స్టార్ట్ చేసింది. తాజాగా మేకర్స్ చిత్రానికి సంబంధించిన మేజర్ అప్డేట్ను ప్రకటించారు.
అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. జూలై 21న లైగర్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్ చుట్టూ బాక్సార్స్ ఉన్నారు. మధ్యలో విజయ్ వారితో బాక్సింగ్ చేస్తున్నట్లు పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇటీవలే విడుదలైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. అంతేకాకుండా ఇండియాలో అత్యధికంగా లైక్స్ వచ్చిన పోస్టర్‌గా నిలిచింది. దక్షిణాది నుండి ఉత్తరాది వరకు సినీతారలు విజయ్ను పొగడ్తలతో ముంచెత్తారు. అక్డీపక్డీ సాంగ్ కూడా ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది.
ముంభైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం విజయ్ ఖుషి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తుంది.
INDIA!
MASS on- July 21st.
ACTION on- July 21st.
ENTERTAINMENT on-July 21st.#LigerTrailer on July 21st.
Telugu. Hindi. Tamil. Kannada. Malayalam.#LIGER#LigerTrailerOnJuly21@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @DharmaMovies @PuriConnects @sonymusicindia pic.twitter.com/8CeyLWSeX7— Puri Connects (@PuriConnects) July 16, 2022