Agent Movie | ‘ఏజెంట్’ టీజర్‌పై మహేష్‌బాబు ప్రశంసలు.. థాంక్యూ బ్రదర్ అంటూ అఖిల్ రీట్వీట్
Mahesh babu tweet on agent teaser | ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో మొదటి హిట్ అందుకున్నాడు అఖిల్ అక్కినేని. కానీ ఈ చిత్రం అక్కినేని అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టలేకపోయింది. ఈ క్రమంలోనే అఖిల్ ఈ సారి ఎలాగైనా ఫ్యాన్స్‌ను పూర్తిగా సంతృప్తి పరచాలనే ఉద్ధేశ్యంతో ‘ఏజెంట్’ అనే భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. హాలీవుడ్లో లెవల్ స్టంట్స్‌తో టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ టీజర్‌పై మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్ చేశాడు.
‘ఏజెంట్ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, థీమ్ చాలా బాగున్నాయి. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ మహేష్ బాబు ట్విట్టర్లో పేర్కొన్నాడు. దీనిపై అఖిల్ స్పందించి ‘థాంక్యూ బ్రదర్, మీ సపోర్ట్, ప్రోత్సాహం చాలా విలువైనది’ అంటూ రీట్వీట్ చేశాడు. ఇటీవలే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్‌ను సాధించింది. అంతేకాకుండా టైర్2 హీరోలలో అత్యధిక లైక్స్ వచ్చిన టీజర్‌గా ఏజెంట్ నిలిచింది. అంటే సుందరానికీ తర్వాత 24గంటల్లో అత్యధిక వ్యూస్ వచ్చిన టీజర్‌గా కూడా నిలిచింది. మలయళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఏ.కే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
#AgentTeaser looks absolutely stunning!! Love the visuals and the theme of the film! All the best @mammukka sir @AkhilAkkineni8 @AnilSunkara1 @DirSurender and the entire team! Looking forward! 🙂https://t.co/ecNasoflIr
— Mahesh Babu (@urstrulyMahesh) July 16, 2022
Thank you so much brother 🙏🏻 we are thrilled to see your support and encouragement. Means a lot 🙏🏻 https://t.co/ps7kOMeAdT
— Akhil Akkineni (@AkhilAkkineni8) July 16, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

