Sita Ramam Movie | సిరివెన్నెల రచించిన ‘కానున్న కళ్యాణం’ ప్రోమో రిలీజ్
Kanunna Kalyanam Song Promo | మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఓకే బంగారం’ సినిమాతో పరిచయమైన దుల్కర్ ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహానటి తర్వాత ఈయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ టీజర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి మేకర్స్ తాజాగా థర్డ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు.
కానున్న కళ్యాణం ఎమన్నది అంటూ సాగే మెలోడియస్ సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఈ పాటకు సాహిత్యం అందించాడు. అనురాగ్ కులకర్ణి, సింధూరి ఆలపించారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో శ్రోతలను ఆకట్టుకుంటుంది. పీ.ఎస్ వినోద్ కెమెరా విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ పాట ఫుల్ లిరికల్ సాంగ్ జూలై 18న విడుదల కానుంది. రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించనున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించనుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది.
Read Also:
Keerthy Suresh | కీర్తిసురేష్‌కు ఆ స్టార్ హీరో నటనంటే చాలా ఇష్టమట?
Chandramukhi-2 | ‘చంద్రముఖి’ సీక్వెల్ మొదలైంది.. వైరల్ అవుతున్న లాంఛింగ్ ఫోటోస్
Kiran Abbavaram | బాలీవుడ్ స్టార్ హీరోతో పోటీ పడనున్న కిరణ్ అబ్బవరం?
NBK107 Movie | దసరా రేసు నుండి తప్పుకుంటున్న బాలకృష్ణ.. కారణం ఇదేనట?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

