NBK107 Movie | దసరా రేసు నుండి తప్పుకుంటున్న బాలకృష్ణ.. కారణం ఇదేనట?
Balakrishna-Gopichandh Malineni Movie | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌ను తన నెక్ట్స్ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ పొలిటికల్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బాలయ్య ఈ చిత్రంలో రెండు గెటప్‌లలో కనిపించబోతున్నట్లు టాక్. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ పేర్కొన్నారు.
తాజాగా ఈ చిత్రం దసరా రేసు నుండి తప్పకుంటున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం బాలకృష్ణకు రెండు సార్లు కొవిడ్ రావడం. అంతేకాకుండా పలువురు టెక్నీషియన్లకు కూడా కొవిడ్ రావడంతో షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఇంకా షూటింగ్ పార్ట్ చాలానే ఉందట.దాంతో ఈ చిత్రం దసరా రేసు నుండి తప్పుకోనుందట. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య చిత్రానికి అన్నగారు అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈయన షూటింగ్లో పాల్గొన్నాడు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు. ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే దసరా రేసులో చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరిద్దరి మధ్య పోటీ రావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
Kavya Maran | వివాహ బంధంలో అడుగుపెట్టిన అనిరుధ్ కావ్య మారన్..
Khaajaguda Land Dispute | ఖాజాగూడ భూదోపిడీలో పెద్దల హస్తం.. రక్షించాల్సిన సర్కారే భక్షిస్తున్న వైనం: దాసోజు శ్రవణ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

