Chandramukhi-2 Shooting | లారెన్స్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించి దర్శకుడిగా, నటుడిగా పలు విభాగాల్లో పనిచేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘చంద్రముఖి-2’ ఒకటి. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అప్పటివరకు ఉన్న హార్రర్ ఫార్ములానే మార్చేసింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జ్యోతిక చంద్రముఖిగా నటించింది. జ్యోతిక నటన వర్ణనాతీతం. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతుంది.
నిజానికి చంద్రముఖి విజయం తర్వాత రజినీతోనే సీక్వెల్‌ను పట్టాలెక్కించాలని దర్శకుడు p.వాసు ఎంతో ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు. ఇన్నేళ్ళకు లారెన్స్‌తో p.వాసు చంద్రముఖి-2ను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. వడివేలు, రాధికా శరత్‌కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే చిత్రం నుండి విడుదలైన ప్రీ లుక్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి.
Kickstarted the Shoot 🎥 of #Chandramukhi2 🗝️✨ with a Pooja 🏵️ yesterday at 📍 Mysore
Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎
Directed by #PVasu 🎬
Music by @mmkeeravaani 🎶
Cinematography by @RDRajasekar 🎥
Art by #ThottaTharani 🎨
PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/zFG6ynynnG— Lyca Productions (@LycaProductions) July 16, 2022
Read Also:
Kiran Abbavaram | బాలీవుడ్ స్టార్ హీరోతో పోటీ పడనున్న కిరణ్ అబ్బవరం?
Chiranjeevi | అమీర్‌ఖాన్ నటనపై చిరు ప్రశంసలు.. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రివ్యూ వీడియో వైరల్
Vikram61 | గ్రాండ్‌గా లాంఛ్ అయిన విక్రమ్ నెక్స్ట్ సినిమా.. వైరల్ అవుతున్న వీడియో
NBK107 Movie | దసరా రేసు నుండి తప్పుకుంటున్న బాలకృష్ణ.. కారణం ఇదేనట?