Chiranjeevi | అమీర్‌ఖాన్ నటనపై చిరు ప్రశంసలు.. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రివ్యూ వీడియో వైరల్
Chiranjeevi Praises Ameer khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ నుండి సినిమా వచ్చి నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ తర్వాత ఇప్పటివరకు ఈయన సినిమా రాలేదు. అమీర్‌ను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలకు సిద్ధంగా ఉంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగ చైతన్య కీలకపాత్రలో నటించాడు. తాజాగా చిరు ఇంట్లో ఈ సినిమా ప్రివ్యూ షో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. ఈ ప్రివ్యూ షోను అమీర్‌ఖాన్‌తో కలిసి చిరు, నాగ్, రాజమౌళి, సుకుమార్, నాగ చైతన్య వీక్షించారు. ప్రివ్యూ ఫోటో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై చిరు ట్విట్టర్లో స్పందిస్తూ వీడియోను షేర్ చేశాడు.
‘చాలా రోజుల క్రీతం జపాన్‌లోని టోక్యో ఏయిర్‌పోర్ట్‌లో అమీర్‌ఖాన్‌ను కలిశాను. మా ఇద్దరి మధ్య చిట్ చాట్ జరిగింది. ఈ చిట్ చాట్ అమీర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘లాల్ సింగ్ చడ్డా’లో నన్ను కూడా భాగమయ్యేలా చేసిందంటూ’ ట్విట్టర్లో తెలిపాడు. అంతేకాకుండా తన ఇంట్లో ప్రివ్యూ వేసినందుకు అమీర్‌ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. చిరు షేర్ చేసిన వీడియోలో ప్రివ్యూ అనంతరం అమీర్‌ను చిరు సత్కరించాడు. సినిమా బావుందంటూ ప్రశంలతో ముంచెత్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రం హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో అమీర్‌కు జోడీగా కరీనా కపూర్ నటించింది. వయాకామ్ 18 స్టూడీయోస్‌తో కలిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంపై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. ఇక లేటెస్ట్గా విడులైన ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.
Fascinating how a chance meeting & a little chat with my dear friend #AamirKhan @Kyoto airport – Japan, few years ago led to me becoming a part of his dream project #LaalSinghChaddha
Thank You #AamirKhan for the exclusive preview at my home.Heartened by your warm warm gesture! pic.twitter.com/hQYVZ1UQ5m
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022
Read Also:
Vikram61 | గ్రాండ్‌గా లాంఛ్ అయిన విక్రమ్ నెక్స్ట్ సినిమా.. వైరల్ అవుతున్న వీడియో
Kiran Abbavaram | బాలీవుడ్ స్టార్ హీరోతో పోటీ పడనున్న కిరణ్ అబ్బవరం?
NBK107 Movie | దసరా రేసు నుండి తప్పుకుంటున్న బాలకృష్ణ.. కారణం ఇదేనట?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

