Major Movie OTT Records | మొదటి నుండి కంటెంట్ ప్రధానమున్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడివిశేష్. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచాడు. టాలీవుడ్లో ఈయన సినిమాలకు మంచి అధరణ వస్తుంది. అడివి శేష్ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇటీవలే ‘మేజర్’తో శేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంభై దాడుల్లో అమర వీరుడైన సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అడివిశేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా మేజర్ నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఓటీటీలోనే ఈ చిత్రం దూసుకుపోతుంది.
తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నాన్-ఇంగ్లీష్ సినిమాలలో దక్షిణాసియాలో మొదటి స్థానంలో.. వరల్డ్ వైడ్‌గా 8వ స్థానంలో నిలిచింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ విడుదల చేసిన ట్రెండింగ్ టాప్ 10లో మేజర్ చిత్రం 14 దేశాల్లో టాప్ 10లో ఉంది. ఇలా ఓటీటీలో కూడా మేజర్ ఈ మేర విజయం సాధించడం విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రంలో సందీప్ పాత్రలో అడివిశేష్ నటన వర్ణనాతీతం. బయోగ్రాఫీకల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాల కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం అడివిశేష్ నటించిన ‘హిట్-2’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ‘గూఢాచారి-2’ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
WORLDWIDE #Top10 both versions of #MajorTheFilm in Netflix Non English film category.
AND for ALL Languages:
#1 in #SouthAsia and #Top10 in 14 countries pic.twitter.com/If0jiqt9bx— Adivi Sesh (@AdiviSesh) July 15, 2022