Thug life | లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug life). KH234గా తెరకెక్కుతున్న థగ్ లైఫ్‌లో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి, శింబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 పొంగళ్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఇదే సీజన్లో మరో స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి కూడా సందడి చేయనుందని వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద Thoongavanam, Vedalam సినిమాలు వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ అజిత్, కమల్ హాసన్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ రిపీట్ కానుంది. మరి విడుదల తేదీలపై అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ పోరుపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
థగ్ లైఫ్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న విదాముయార్చి చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు.
Devara | రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ.. స్టన్నింగ్‌గా జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 ట్రైలర్
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్