Devara | గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది మూవీ టీం.
అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. అసలెవరు వాళ్లంతా.. కులం లేదు.. మతం లేదు.. భయమే లేదు.. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో సాగే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. ఎవరు చేశారిదంతా అంటుంటే.. చాలా పెద్ద కథ సామి.. రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. అంటూ ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. స్టన్నింగ్‌గా సాగుతున్న ట్రైలర్ తారక్ అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నట్టు చెప్పకనే చెబుతోంది.
దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర రోల్లో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దేవర పార్ట్ 1 ట్రైలర్..
ఈ చిత్రం ట్రైలర్ విడుదలకు ముందే అనార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ప్రీ సేల్స్‌లో రూ.8.2 కోట్ల మార్క్‌ను అధిగమించి అరుదైన ఫీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదలకు ముందే వేగంగా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిన తొలి ఇండియా సినిమాగా అరుదైన రికార్డు నమోదు చేసింది.
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్