Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఇటీవలే ది గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాడు మంచి హిట్‌గా నిలువగా.. తెలుగులో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడిక నెక్ట్స్ ప్రాజెక్ట్ దళపతి 69 (Thalapathy 69)కు సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది.
ఈ చిత్రం కాప్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుండగా.. మరోసారి విజయ్ పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడట. ఈ వార్తలు నిజమైతే తేరి సినిమా తర్వాత విజయ్ కాప్ రోల్లో నటిస్తోన్న సినిమా ఇదే కానుంది. మరి దీనిపై విజయ్ టీం ఏదైనా అధికారిక ప్రకటన చేస్తుందనేది చూడాల్సి ఉంది. విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్న నేపథ్యంలో కెరీర్లో ఇదే చివరి సినిమా కాబోతుంది. మరి ఇంతకీ ఈ చిత్రం పొలిటికల్ టచ్‌లో ఉండనుందా..? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హెచ్ వినోథ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ కేవీఎన్ ప్రొడక్షన్ తెరకెక్కించనుంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్
Raghu Thatha | ఓటీటీలో కీర్తి సురేశ్ రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?