నందమూరి హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు బింబిసార (Bimbisara). హర్యంక వంశస్థుడు మగధ రాజ్యాన్ని పాలించిన బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
బాబాయితో కలిసి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు కల్యాణ్ రామ్. బాలకృష్ణ (Balakrishna) నటించిన అఖండ (Akhanda) డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. అఖండ స్క్రీనింగ్ టైంలో బింబిసార టీజర్ కూడా ప్లే చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారని టాలీవుడ్ సర్కిల్ టాక్. మొత్తానికి ఒకేసారి బాబాయి సినిమాతోపాటు అబ్బాయి మూవీ టీజర్ (Bimbisara teaser)ను కూడా చూడబోతుండటంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న బింబిసారలో కేథరిన్ ట్రెసా, భీమ్లా నాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బింబిసార చిత్రానికి తమ్మిరాజు ఎడిటింగ్..కాగా కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?