Bimbisara on OTT | ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బింబిసార’ ఓటీటీలోకి వచ్చేసింది. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజై సంచలన విజయం సాధించింది. ఏడేళ్ళుగా హిట్టు కోసం పరితపిస్తున్న కళ్యాణ్‌రామ్‌కు ఈ చిత్రం కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బింబిసారుడిగా, దేవదత్తుడిగా కళ్యాణ్ ద్విపాత్రాభినయంతో అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ చిత్రం కళ్యాణ్‌రామ్ కెరీర్‌కు మంచి బూస్టప్ ఇచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ-5’లో గత అర్థరాత్రి నుండి బింబిసార చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఫాంటసీ యాక్షన్ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సంయుక్తమీనన్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. ఎమ్.ఎమ్ కీరవాణి బాణీలు సమకూర్చాడు. ఈ చిత్రానికి దాదాపు రూ.15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో రూ.40 కోట్ల వరకు షేర్‌ను సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్లో కళ్యాణ్‌రామ్ మార్కెట్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు.
Read Also:
Mallidi Vasishta | ‘బింబిసార’ దర్శకుడుకి రజనీకాంత్ చాన్స్ ఇచ్చాడా?
Salaar Movie | ‘సలార్’లో కాళీమాత రిఫరెన్స్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Mega154 | ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ పాత్ర అంత సేపు ఉండనుందా?
Billa Movie | ‘బిల్లా’ రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల..!