Salaar Movie | ‘సలార్’లో కాళీమాత రిఫరెన్స్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. 'బాహుబలి' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు.
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ ఒకటి. ఇప్పటికే ఈ కాంబోపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘కేజీఎఫ్-2’ చూసిన తర్వాత సలార్ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. సలార్‌లో ప్రభాస్‌ను నీల్ ఏ రెంజ్లో చూపిస్తాడో అని అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ కాళీమాత రిఫరెన్స్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. కేజీఎఫ్ మాదిరిలానే కాళీమాత దగ్గర ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రి, కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన పృథ్విరాజ్ లుక్కు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
Read Also:
‘NBK107’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్.. బాలయ్య కెరీర్లో ఇదే హైయెస్ట్?
Oke Oka Jeevitham | ఓటీటీలోకి వచ్చేసిన శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’.. ఎందులో అంటే?
Vijay Devarakonda | నాని దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడా?
Shah Rukh Khan | ‘పఠాన్’ నుండి క్రేజీ అప్డేట్.. షారుఖ్ ఫ్యాన్స్‌కు పండగే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

