Oke Oka Jeevitham Streaming Platform | ‘మహానుభావుడు’ తర్వాత వరుస ఫేయిల్యూర్స్తో నిరాశలో ఉన్న శర్వానంద్‌కు ‘ఒకే ఒక జీవితం’ మంచి బ్రేక్ ఇచ్చింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజైంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌కు అమ్మ సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు శ్రీకార్తిక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక అంతే అద్భుతంగా శర్వానంద్ ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పోటీగా ‘బ్రహ్మస్త్ర’ వంటి పాన్ ఇండియా సినిమా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
‘ఒకే ఒక జీవితం’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్‌లో ఈ చిత్రం గతరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సై-ఫై డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ నిర్మించారు. అక్కినేని అమల కీలకపాత్రలో నటించింది. శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటించింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.
Read Also:
Brahmastra | అప్పుడే ఓటీటీలోకి ‘బ్రహ్మాస్త్ర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
PS-1 | ‘బ్రహ్మాస్త్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘పొన్నియన్ సెల్వన్’..!
‘NBK107’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్.. బాలయ్య కెరీర్లో ఇదే హైయెస్ట్?
Sardar Movie | ‘సర్దార్’లో కార్తి అన్ని గెటప్స్ వేశాడా.. ఏకంగా సూర్యనే దాటేశాడుగా..!