Sardar Movie | ‘సర్దార్’లో కార్తి అన్ని గెటప్స్ వేశాడా.. ఏకంగా సూర్యనే దాటేశాడుగా..!
Karthi Getup's In Sardar Movie | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 'యుగానికొక్కడు' సినిమా నుండి ఇటీవలే రిలీజైన 'PS-1' వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజయ్యాయి. ఈ ఏడాది 'విరుమన్', 'PS-1' వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు.
Karthi Getup’s In Sardar Movie | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికొక్కడు’ సినిమా నుండి ఇటీవలే రిలీజైన ‘PS-1’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజయ్యాయి. ఈ ఏడాది ‘విరుమన్’, ‘PS-1’ వంటి వరుస విజయాలతో కార్తి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘సర్దార్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘అభిమన్యుడు’ ఫేం పీఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో కార్తి దాదాపు 15 గెటప్స్‌లలో కనిపించనున్నాడట. గతంలో సూర్య వీడొక్కడే సినిమాలో ఒక పాటకోసం దాదాపు 10 గెటప్‌లను వేశాడు. కాగా ఇప్పుడు కార్తి ఏకంగా 15 గెటప్‌లలో కనిపించనున్నాడు. అయితే ఈ గెటప్‌లు పాట కోసం వేశాడా, సినిమాలో భాగంగా వేశాడా అనేది సినిమా రిలీజైన తర్వాతే తెలుస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి డ్యూయల్ రోల్లో తండ్రి, కొడుకుగా నటించాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడీయోస్ సంస్థ విడుదల చేస్తుంది.
Read Also:
Karthi | మెగాఫోన్ పట్టనున్న కార్తి.. తొలి సినిమా ఆ స్టార్ హీరోతోనేనట..!
Brahmastra | అప్పుడే ఓటీటీలోకి ‘బ్రహ్మాస్త్ర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Rc15 | శంకర్-రామ్‌చరణ్ మూవీలో సీనియర్ స్టార్ హీరోయిన్?
Allu Aravind | ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అల్లు అరవింద్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

