Vijay Devarakonda | నాని దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడా?
Vijay Devarakonda Next Film | 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకుని విజయ్ దేవరకొండ 'లైగర్'తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది.
Vijay Devarakonda Next Film | ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకుని విజయ్ దేవరకొండ ‘లైగర్’తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి థియేటర్ రెంట్‌కు సరిపడా డబ్బులు కూడా రాలేవు. ఇక రిలీజైన వారంలోపే దుకాణం సర్దేసింది. ఈ సినిమా ఫలితం విజయ్ను తీవ్రంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న విజయ్ కల.. కల గానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనుంది. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ‘లైగర్’ తర్వాత ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. కథను ఓకే చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచే విజయ్.. ఈ సారి మాత్రం తన నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఖుషి ఫలితం తర్వాతే విజయ్ తన తదుపరి సినిమా గురించి ఆలోచించనున్నట్లు నిన్నటి వరకు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈయన ఓ యంగ్ దర్శకుడికి చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరితో విజయ్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు టాక్. ఇటీవలే గౌతమ్, విజయ్ను కలిసి ఓ కథ నెరేట్ చేశాడని, కథ బాగా నచ్చడంతో విజయ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక గౌతమ్ తిన్ననూరి ఇటీవలే బాలీవుడ్లో జెర్సీ సినిమాను షాహిద్కపూర్తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్నందుకోలేపోయింది. ఈ చిత్రం తర్వాత గౌతమ్ తిన్ననూరి, రామ్‌చరణ్‌తో ‘RC16’ చేయాల్సిఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
Read Also:
Brahmastra | అప్పుడే ఓటీటీలోకి ‘బ్రహ్మాస్త్ర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘NBK107’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్.. బాలయ్య కెరీర్లో ఇదే హైయెస్ట్?
Sardar Movie | ‘సర్దార్’లో కార్తి అన్ని గెటప్స్ వేశాడా.. ఏకంగా సూర్యనే దాటేశాడుగా..!
Oke Oka Jeevitham | ఓటీటీలోకి వచ్చేసిన శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’.. ఎందులో అంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

