Mallidi Vasishta Next Movie | ఎన్నో ఎళ్ళుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్‌రామ్‌కు ‘బింబిసార’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 5న రిలీజైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌కు ఫాంటసీ డ్రామాను జోడించి దర్శకుడు మల్లిడీ వశిష్ట్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. పేరుకు డెబ్యూ సినిమానే అయినా.. ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న దర్శకుడిగా ఈ సినిమాను రూపొందించాడు. ఈ చిత్రంలో వశిష్ట్ స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం, టేకింగ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో మల్లడి వశిష్ట్ పేరు మర్మోగిపోయింది.
అయితే మల్లడి వశిష్ట్ నెక్ట్స్ సినిమా ఎవరితోని అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ముందుగా కళ్యాణ్‌రామ్‌తో ‘బింబిసార-2’ తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. ఈ మూడు పూర్తయిన తర్వాతే బింబిసార-2 పట్టాలెక్కనుంది. ఈ లోపు మరో పెద్ద సినిమా చేయాలని అనుకున్నాడట. ఈ క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఓ స్టోరి నెరేట్ చేశాడట. అయితే రజనీ నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని టాక్. ఒకవేళ రజినీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మల్లడి వశిష్ట పేరు దక్షిణాదిన మార్మోగిపోతుంది. ప్రస్తుతం రజనీ నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా చేస్తున్నాడు.