Billa Movie Trailer | ప్రభాస్ కెరీర్లో అండర్ రేటెడ్ మూవీస్‌లో ‘బిల్లా’ ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. రిలీజ్ రోజే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న.. బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటించాడు. బిల్లాగా, రంగాగా రెండు పాత్రల్లో విభిన్న వేరియేషన్‌తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ముఖ్యంగా అండర్‌వల్డ్ డాన్‌గా ప్రభాస్ నటన వర్ణానాతీతం. స్టైలిష్ డాన్‌గా ప్రభాస్ టాలీవుడ్‌కు ఓ బెంచ్ మార్కు క్రియేట్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ గాని, స్టంట్స్ గాని అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ‘బిల్లా’ రీ-రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
‘బిల్లా.. ఇండియా, రష్యా, యూఏఈ, థాయిలాండ్, మలేషియా దాదాపు 11 దేశాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు’ అంటూ కృష్ణంరాజు వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టు ట్రైలర్‌ను బాగా కట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపికృష్ణ బ్యానర్‌పై ప్రభాస్ అన్న ప్రభోద్ ఉప్పలపాటి నిర్మించాడు. ఈ సినిమాను అక్టోబర్ 23న పెద్ద మొత్తంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ‘వర్షం’ సినిమాను కూడా కొన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నారు. ఇక శనివారం రీ-రిలీజైన ‘రెబల్’ సినిమాకు విశేష స్పందన వచ్చింది.
Read Also:
Salaar Movie | ‘సలార్’లో కాళీమాత రిఫరెన్స్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Mega154 | ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ పాత్ర అంత సేపు ఉండనుందా?
Mallidi Vasishta | ‘బింబిసార’ దర్శకుడుకి రజనీకాంత్ చాన్స్ ఇచ్చాడా?
Vijay Devarakonda | నాని దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడా?