Kalki 2898 AD | పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్ బస్టర్ ‘కల్కి’. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై సూపర్‌హిట్ అందుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది. ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్ ఉందని నాగ్ అశ్విన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీక్వెల్‌ను అయితే ప్రకటించారు కానీ ఎప్పుడు మొదలుపెట్టనున్నారు అనేది మాత్రం వెల్లడించలేదు.
అయితే తాజాగా కల్కి 2 సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ను పంచుకున్నారు నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్‌లు. వీరిద్దరూ.. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో పాల్గోని అక్కడి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే మూవీ అప్డేట్ను పంచుకున్నారు.
ఈ మూవీ షూటింగ్ అప్డేట్పై నిర్మాత ప్రియంకా దత్ మాట్లాడుతూ.. కల్కి 2 షూటింగ్ మరో ఆరు నెలల్లో మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. ఒక్కసారి మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే వరుస అప్డేట్లను ఇస్తాం అని తెలిపారు. స్వప్నా దత్ మాట్లాడుతూ.. మొదటి పార్ట్ కంటే ఈ మూవీ కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా ఉన్నాం. కల్కి నుంచి చాలా నేర్చుకున్నాం. కొత్త ఎనర్జీతో కల్కి 2ను మొదలుపెట్టబోతున్నాం అంటూ చెప్పుకోచ్చింది.
Also read..