PM Modi : గడిచిన పదేండ్లలో దేశంలో బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య 6 కోట్ల నుంచి ఏకంగా 94 కోట్లకు పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. దేశంలో తగినంత సంఖ్యలో బ్యాంకుల బ్రాంచ్‌లు లేవని, గ్రామాల్లో బ్యాంకులు అందుబాటులో లేవని పార్లమెంట్లో సభ్యులు తరచూ లేవనెత్తేవారని, ఇంటర్నెట్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో లేవనే ఫిర్యాదులు వెల్లువెత్తేవని చెప్పారు.
మౌలిక సదుపాయాలు పేలవంగా ఉంటే ఫిన్‌టెక్ విప్లవం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కానీ తమ పదేండ్ల హయాంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు మారుమూల గ్రామాకు సైతం విస్తరించాయని చెప్పుకొచ్చారు. ఇక అంతకుముందు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఫిన్‌టెక్ పెవిలియన్‌ను సందర్శించి అక్కడున్న స్టాల్స్‌లో కలియతిరిగారు. ఫిన్‌టెక్ రంగంలో తాజా వినూత్న ఆవిష్కరణలతో కూడిన ప్రదర్శనలను తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఓ స్టాల్లో వర్చువల్ రియాలిటీ గ్లాసెస్‌ను ధరించారు. పరిశ్రమ నిపుణులతో కొద్దిసేపు ముచ్చటించారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో దేశ విదేశాలకు చెందిన పలువురు విధాన నిర్ణేతలు, నియంత్రణ సంస్ధలు, బ్యాంకర్లు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఇక మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు.
Read More :
Shraddha Kapoor | కిరాయి ఇంటికి షిఫ్ట్ అయిన బాలీవుడ్ అందాల భామ..