Shraddha Kapoor | బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ రీసెంట్గా ఓ అద్దె ఇంట్లోకి సామాన్లతో సహా షిఫ్ట్ అయ్యింది. అంత పెద్ద హీరోయిన్ అద్దె ఇంటికి షిఫ్ట్ అవ్వడమేంటి? అనుకుంటున్నారా! వివరాల్లోకెళ్తే.. ముంబైలోని జుహూ ప్రాంతంలో 1987లోనే శ్రద్ధా తండ్రి శక్తికపూర్ ఓ ఇంటిని కొన్నారు. మొన్నటివరకూ ఆ ఇంట్లోనే తండ్రితోపాటు శ్రద్ధా ఉండేది. ఆ ఇల్లు కట్టి 37ఏళ్లు అవుతున్నా.. ఇంకా పటిష్టంగానే ఉండటం గమనార్హం. అయితే.. ఇల్లు పాత బడిపోవడం, ట్రెండ్‌కి తగ్గట్టు లేకపోవడం, దానికి తోడు పాతకాలం నాటి డిజైన్లు. అందుకే.. ఆ ఇంటిని మోడ్రనేట్ చేయాలని శ్రద్ధా భావించింది.
తండ్రి నుంచి అనుమతి తీసుకొని ఇంటి రెన్నోవేషన్ పనులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే సామాన్లతో సహా ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యింది. శ్రద్ధ కొత్తగా చేరిన ఇల్లు కూడా ఎవరిదోకాదు. హీరో హృతిక్ రోషన్ది. ఇంటి రెన్నోవేషన్ పూర్తయ్యే వరకూ జుహూ ప్రాంతంలోనే బీచ్‌కి అభిముఖంగా ఖాళీగా ఉన్న హృతిక్ ఇంట్లోకి అద్దెకు దిగింది శ్రద్ధా కపూర్.
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ ఇల్లు కూడా ఆ ఇంటి పక్కనే కావడం విశేషం. ఇదిలావుంటే.. శద్ధ కపూర్ కథానాయికగా నటించిన ‘స్త్రీ 2’ చిత్రం ఇప్పటికే 500కోట్ల క్లబ్లో చేరి, విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఈ సినిమాకోసం శ్రద్ధకు కిచ్చిన రెమ్యునరేషన్‌తో పాటు, సినిమా లాభాల్లోనుంచి కూడా కొంత వాటా ఇవ్వాలని నిర్మాతలు భావిస్తున్నారట.