Gayatri Joshi | సినీ ఇండస్ట్రీ రంగుల ప్రపంచమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక్కడ ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించి కోట్లు గడించినవాళ్లున్నారు.. ఒకసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి కనుమరుగైపోయినవాళ్లున్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నా ఆర్థికంగా నిలదొక్కులేని వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఒక సినిమాలో మాత్రమే నటించి కోట్లకు అధిపతులైనవాళ్లు చాలా అరుదుగా ఉంటారు.
అలాంటి వారి జాబితాలో టాప్‌లో ఉంటుంది నటి గాయత్రి జోషి. ఈ భామ నటించింది ఒకే ఒక్క సినిమాలో.. అది కూడా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన స్వదేశ్ (Swades) . ఇదే గాయత్రి జోషికి మొదటి, చివరి సినిమా. ఈ మూవీ తర్వాత మళ్లెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే ఈ బ్యూటీ నటించింది ఒక్క సినిమాలోనే కానీ ఆస్తుల విలువ మాత్రం రూ.60 వేల కోట్లు. అవును మీరు చదివింది నిజమే.
ఇంతకీ గాయత్రి జోషి ఆస్తుల విలువ ఇంతగా ఉండటానికి కారణమేమై ఉంటుందనుకుంటున్నారా..? దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్న విషయాన్ని తూచ తప్పకుండా ఫాలో అయింది గాయత్రి జోషి. స్వదేశ్ మూవీ టైంలోనే వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌కి నటి గాయత్రి జోషితో పరిచయం ఏర్పడింది.
హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పైలట్‌గా ట్రైనింగ్ తీసుకున్న వికాస్ తర్వాత తన తండ్రి వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. గాయత్రి కూడా వికాస్‌కు దగ్గరైంది. ఈ క్రమంలో ఇద్దరూ 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత గాయత్రి జోషి వికాస్‌కు చెందిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆపరేషన్స్‌లో జాయిన్ అయింది. అలా గాయత్రి జోషి 20 ఏండ్ల ప్రయాణంలో భర్తతో కలిసి సుమారు రూ. 60 వేల కోట్లకు ఎదిగింది.
కెరీర్లో ఒక్క సినిమా చేసిన వెనక్కి తగ్గిన గాయత్రి జోషి ఇప్పుడు ఏకంగా భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని రన్ చేస్తూ లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. వికాస్, గాయత్రి జోషికి ఇద్దరు కుమారులున్నారు.
Karuppu | టాక్ ఆఫ్ ది టౌన్‌గా సూర్య కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్
Andhra King Taluka Review | ‘ఆంధ్రకింగ్ తాలూకా’ రివ్యూ.. రామ్ పోతినేని హిట్టు కొట్టాడా.?
Kantara Chapter 1 | ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ ఇప్పుడు ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసా?