ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల జాబితా చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఏ దర్శకుడిని వదిలిపెట్టకుండా అందరిని లైన్లో పెట్టాడు తారక్. అయినా ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా రప్ఫాడించే అద్భుతమైన నటుడు. అందుకే ఈయనతో సినిమా అంటే సై అంటారు దర్శక నిర్మాతలు. ట్రిపుల్ ఆర్తో బిజీ కావడంతో 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత ఈయన నుంచి ఏ సినిమా రాలేదు. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు వరుస సినిమాలు ఒప్పుకుంటున్న ఎన్టీఆర్.. మరో మూడేళ్ల వరకు ఖాళీగా ఉండకుండా చూసుకుంటున్నాడు. 2024 వరకు వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే ఇప్పుడు మిగిలిన హీరోలకు పిచ్చెక్కిపోతుంది. వరసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అవుతూ పిచ్చెక్కిస్తున్నాడు జూనియర్. ప్రస్తుతం రాజమౌళితో ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు జూనియర్. ఈ సినిమా షూటింగ్ జులైలోపు పూర్తి కానుంది. సినిమా అక్టోబర్ 13న దసరా సందర్భంగా విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ లైన్లోకి రానున్నాడు. ఈ సినిమా కూడా త్వరగానే పూర్తి చేయాలని చూస్తున్నాడు తారక్. 2022 సమ్మర్ లో త్రివిక్రమ్ సినిమా విడుదల కానుంది. పూర్తి పొలిటికల్ సెటైరికల్ సినిమాగా రూపొందబోయే ఈ చిత్రానికి అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా తర్వాత కొరటాల శివ కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు తారక్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. 2022 చివర్లో సినిమా ఉండబోతుంది.
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి సంచలన ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, దిల్ రాజు సంయుక్తంగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న పరశురామ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక లైన్ సిద్ధం చేశాడు. 2023లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి 6 సినిమాలతో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు జూనియర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సాయంత్రం ఎన్టీఆర్ 30వ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
కేటీఆర్ సర్.. మీరు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించలేదా?
16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న లెజండరీ స్టార్స్
హీరోయిన్‌పై నెమలి దాడి.. వీడియో వైరల్
రామ్‌చరణ్ చిత్రంలో సల్మాన్?