న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్యా మిట్టల్(IAS Divya Mittal) కొన్ని రోజుల క్రితం తన పోస్టుకు రాజీనామా చేశారు. అయితే రాజకీయాల్లో ప్రవేశించనున్నట్లు ఆమె ఇవాళ ప్రకటించారు. యూపీలో పొలిటికల్ జర్నీ ఉంటుందని, కానీ ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆమె చెప్పారు. దివ్యా మిట్టల్ తన వీడియో సందేశంలో అనేక అంశాలను తెలిపారు. హర్యానాలోని రివారికి చెందిన మిట్టల్ తాను యూపీలోనే పోటీ చేయనున్నట్లు చెప్పారు. తానేమీ భయపడడం లేదని, కానీ సమాజంలో వ్యవస్థను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. తనకు సపోర్టు ఇవ్వాలని ఆమె ప్రజల్ని కోరారు. పేదల గొంతు కావాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
సివిల్ సర్వీస్‌లో 13 ఏళ్ల పాటు ఆమె పనిచేశారు. ఆగస్టు 30వ తేదీన ఆమె రాజీనామా చేస్తే, సెప్టెంబర్‌లో దాన్ని అంగీకరించారు. మీర్జాపూర్, డియోరియాలో మిట్టల్ జిల్లా మెజిస్ట్రేట్ చేశారు. అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవాన్ని .. ప్రజాసేవకు అంకితం చేయాలనుకుంటున్నారు. ఆమె తన వాట్సాప్ నెంబర్ కూడా రిలీజ్ చేసింది. ఆ నెంబర్‌తో కనెక్ట్ కావాలని ప్రజల్ని కోరింది. రహస్యంగా రాజకీయ నేతల్ని కలుస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు.