Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Rahul Gandhi: తన ఫోన్ ట్యాప్ అయినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తనపై నిఘా ఉన్న విషయం ప్రధాని మోదీకి తెలుసు అని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రాహుల్ తన తలకు పరీక్ష చేయించుకోవాలని చంద్రశేఖర్ సూచించారు.
న్యూఢిల్లీ: తన ఫోన్ ట్యాప్ అయినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. తనపై నిఘా ఉన్న విషయం ప్రధాని మోదీకి తెలుసు అని పేర్కొన్నారు. మోదీ తనతో ముఖాముఖి చర్చకు రావాలని రాహుల్ సవాల్ విసిరారు. విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరు ఉన్నారో తెలుస్తుందని, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎవరు పాల్గొన్నారో తెలుస్తుందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ అకౌంట్లో రాహుల్ గాంధీ వీడియోను పోస్టు చేసింది. మోదీయే తన ఫోన్ ట్యాప్ చేశారని రాహుల్ పేర్కొన్నారు. తనతో చర్చకు వచ్చే ధైర్యం మోదీకి లేదని, ఆయన స్క్రిప్టు చూసి మాట్లాడుతారని ఆరోపించారు. ఎక్కడైనా పర్వాలేదని, టెలిప్రాంప్టర్ను తీసుకువచ్చి డిబేట్లో పాల్గోవాలని, మీకు నచ్చిన జడ్జీని పెట్టాలని రాహుల్ కోరారు. నిజమైన దేశద్రోహి ఎవరో తెలియాలంటే, చర్చకు రావాల్సిందే అని రాహుల్ అన్నారు. తనతో నేరుగా చర్చలో పాల్గొంటే, ప్రధాని మోదీ రాజకీయ కెరీర్ ముగుస్తుందని రాహుల్ పేర్కొన్నారు.
𝐓𝐡𝐞 𝐨𝐧𝐞-𝐨𝐧-𝐨𝐧𝐞 𝐝𝐞𝐛𝐚𝐭𝐞 𝐰𝐢𝐥𝐥 𝐩𝐫𝐨𝐯𝐞 𝐍𝐚𝐫𝐞𝐧𝐝𝐫𝐚 𝐌𝐨𝐝𝐢 𝐢𝐬 𝐜𝐨𝐧𝐭𝐫𝐨𝐥𝐥𝐞𝐝 𝐛𝐲 𝐟𝐨𝐫𝐞𝐢𝐠𝐧 𝐩𝐨𝐰𝐞𝐫𝐬 𝐚𝐧𝐝 𝐢𝐬 𝐚𝐧𝐭𝐢-𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥. https://t.co/lhcxKdv6ph
— Congress (@INCIndia) November 13, 2026
రాహుల్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. మంచితనంతో రాహుల్ తన తలకు వైద్య పరీక్ష చేయించుకోవాలని సూచించారు. రాహుల్ ఫోన్ ఎవరూ ట్యాప్ చేయరని, అంత ఆసక్తి ఎవరికి లేదని, ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆయన బ్రెయిన్ ఎందుకిలా రోజూ అబద్ధం చెబుతుందో తెలుసుకోవాలని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

