రచయిత నుండి దర్శకుడిగా మారి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న స్టైలిష్ దర్శకుడు కొరటాల శివ. తీసిన ప్రతి సినిమాను విజయ పంథాలో నడిపించి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించాడు. కొరటాలతో సినిమా అంటే హిట్ అనే భావన అభిమానులలోను ఉంది. గత మూడేళ్లుగా చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు కొరటాల.
ఆచార్య షూటింగ్ పది రోజులు ఉండగా, అది పూర్తైన తర్వాత ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ చిత్రం తెరకెక్కించిన కొరటాల ఇప్పుడు తన తదుపరి సినిమాకు మరిన్ని రిపేర్స్ చేసి బ్లాక్ బస్టర్ అందించనున్నాడు.అయితే ఈ రోజు కొరటాల శివ పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు సహా అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన విషెస్ ప్రత్యేకంగా మారింది.
“స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ రకంగా తెలియజేశారు ఎన్టీఆర్.