జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది.
కాగా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 21న జపాన్‌లో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. ఇప్పటికే ఎన్టీఆర్ జపనీస్ మీడియాతో చిట్ చాట్ లో కూడా పాల్గొన్నాడు. కాగా ఇపుడు ప్రత్యక్షంగా ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జపాన్‌కు బయలుదేరాడు తారక్.
ట్రావెల్ బ్యాగ్ అండ్ సూట్‌కేస్‌తో తారక్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్తున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ త్వరలోనే జపాన్‌లో కూడా రికార్డుల వేట మొదలుపెట్టనుందని తారక్ ప్రమోషన్స్ అప్డేట్తో అర్థమవుతుంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో నటించాడు.
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్, ఉక్రెయిన్ భామ ఒలీవియా మొర్రీస్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ను తెరకెక్కించారు. త్వరలోనే కొరటాల శివతో చేయనున్న NTR30 సినిమాను కూడా మొదలుపెట్టనున్నాడు తారక్. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడుమీదున్నాయి.
Young Tiger #NTR off to Japan for @RRRMovie promotions@tarak9999 #RRRInJapan pic.twitter.com/nC4A3W5rys
— BA Raju's Team (@baraju_SuperHit) October 18, 2022
Read also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్.. స్టన్నింగ్ లుక్ అవుట్
Read also : Rakshit Atluri | బ్యూటీఫుల్ వీడియోతో పలాస 1978 హీరో శశివదనే అప్డేట్
Read also : laya mangli dance | జాలే వోసినవేమయ్య పాటకు లయ, మంగ్లీ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో
Read also : ‘సర్దార్’ నుండి క్రేజీ అప్డేట్.. అక్కినేని ఫ్యాన్స్‌కు సంబురాలే..!