Devara | గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తారక్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ఇందులో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే అరుదైన ఫీట్ నమోదు చేసి వార్తల్లో నిలిచింది. నార్త్ అమెరికాలో దేవర ప్రీ సేల్స్ షురూ కాగా.. అక్కడి బాక్సాఫీస్ వద్ద రూ.8.2 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ట్రైలర్ విడుదలకు ముందే వేగంగా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిన తొలి ఇండియా సినిమాగా అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది.
దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర రోల్లో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా తారక్ అండ్ సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో స్పెషల్ ప్రమోషనల్ ఎపిసోడ్లో పాల్గొన్నారు.
He’s turning every part into his RED BLOOD sea ❤️🔥❤️🔥#DevaraUSA 🔥🔥#Devara pic.twitter.com/lnBQTgnkU3
— Devara (@DevaraMovie) September 10, 2024
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్
Raghu Thatha | ఓటీటీలో కీర్తి సురేశ్ రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?