Imad Wasim : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం (Imad Wasim) విడాకులు తీసుకున్నాడు. ఆరేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ భార్యకు డైవర్స్ ఇచ్చేశాడీ స్పిన్ ఆల్‌రౌండర్. నిత్యం గొడవల కారణంగానే డైవర్స్ తీసుకున్నామని ఇమాద్ చెబుతున్నా అసలు నిజం వేరు ఉందని అతడి భార్య సానియా అశ్ఫక్ (Sania Ashfaq) అంటోంది. తమ దాంపత్య జీవితం అర్థాంతరంగా ముగియండంపై ఆమె సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్తను మరొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని, అందుకు తాను అందుకే విడాకులు ఇచ్చేస్తున్నా అని ఆమె గుండెలనిండా బాధతో తెలిపింది.
ఇమాద్ వసీం, సానియా అశ్ఫక్లకు 2019 ఆగస్టు 26న వివాహం జరిగింది. ఈ జంటకు ముగ్గురు సంతానం. అయితే.. అనూహ్యంగా డైవర్స్‌కు సిద్ధమయ్యారు. అందుకు కారణం మూడో మనిషే అంటోంది సానియా అశ్ఫక్. ‘మనసునిండా బాధతో ఈ పోస్ట్ రాస్తున్నా. నా హృదయం ముక్కలైంది. నా పిల్లలు తండ్రికి దూరమయ్యారు. నేను ముగ్గురు పిల్లలకు తల్లిని. అయితే.. విడాకులపై నేను ఎందుకు మౌనంగా ఉన్నానో మీకు చెప్పాలనుకుంటున్నా.
అందరిలానే మా వైవాహిక జీవితంలోనూ కష్టాలు ఉన్నాయి. నేను భార్యగా, తల్లిగా నిబద్దతతో ఉన్నాను. నా కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ, మూడో వ్యక్తి(మహిళ) జోక్యంతో మా బంధం అర్థాంతరంగా ముగిసింది. నా భర్తను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఉంది. దాంతో.. నేను సర్దుకొని ఉండలేకపోయాను. అందుకే ఇమాద్ నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని సానియా సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకుంది.
Imad Wasim got divorced today.. There was a buzz he was dating this lady..#ImadWasim #Cricket pic.twitter.com/Qcox9p0B3B
— Haroon (@Haroonbutt110) December 28, 2025
అయితే.. ఇమాద్ మాత్రం నిత్యం గొడవల కారణంగానే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నాడు. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని అతడు అందరినీ కోరుతున్నాడు. నిరుడు టీ20 ప్రపంచకప్ కోసం వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకున్న ఇమాద్.. డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా చెప్పాడు. పాక్ జెర్సీతో అతడు 55 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందిన జట్టులో ఇమాద్ సభ్యుడు.