చుంచుపల్లి, డిసెంబర్ 29 : చుంచుపల్లి మండల తాసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న పి.కృష్ణ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోట్ అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బాలు నాయక్ ఆధ్వర్యంలో డీలర్లు కృష్ణను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ.. మండలంలో తాసీల్దార్గా కృష్ణ మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. ఆయన మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళితో పాటు, రేషన్ డీలర్లు జి.దేవా, బి.రాజ్ కుమార్, ఏ.సేవిలాల్, జి.పవన్, డి.నాని, బి.పూల్ సింగ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.