Warden attack | విద్యార్థినిని చితకబాదిన హాస్టల్ వార్డెన్.. వీడియో
Warden | డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ భవాని కర్ర, చేతులతో విచక్షణారహితంగా కొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న తోటి విద్యార్థినులు వీడియోలో తీశారు.
Warden | ఓ హాస్టల్ వార్డెన్ విద్యార్థినిపై కర్కశంగా వ్యవహరించింది. ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ భవాని ఓ విద్యార్థినిని చితకబాదిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది.
డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ భవాని కర్ర, చేతులతో విచక్షణారహితంగా కొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న తోటి విద్యార్థినులు వీడియోలో తీశారు. గత నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎగ్జిట్ అయి చెప్పి పోయినవ్ కదా హాస్టల్లో.. ఎగ్జిట్ పన్నెండింటికి అయిపోతది. మళ్లీ ఎగ్జిట్ అయిపోయే టైం హాస్టల్ ఉండాలన్న సోయి లేదా నీకు అంటూ వార్డెన్ ఓ వైపు కర్రలు, మరోవైపు చేతులతో విద్యార్థినిని చితకబాదింది. సోషల్ మీడియాలో వార్డెన్ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇదే ఎస్సీ హాస్టల్ వార్డెన్ రెండు నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేయిస్తూ వార్తల్లో నిలిచింది. తాజా ఘటన నేపథ్యంలో హాస్టల్ ముందు విద్యార్థి సంఘాల నిరసన చేపట్టారు. విద్యార్థిని పట్ల దారుణంగా వ్యవహరించిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థినిని చితకబాదిన వార్డెన్
(Sensitive)జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘటన
కర్ర, చేతులతో ఇష్టారీతిన డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని విచక్షణారహితంగా చావబాదిన హాస్టల్ వార్డెన్ భవాని
వీడియో తీసిన తోటి విద్యార్థినులు
గత నెల 24న… pic.twitter.com/gsa3E4LrRH
— ChotaNews App (@ChotaNewsApp) December 29, 2025
Read Also :
Mahabubabad | ఉన్నత చదువుల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి.. అమెరికాలో మహబూబాబాద్ యువతులు మృతి
Tanuja | బిగ్ బాస్ తర్వాత కూడా మనసులు గెలుస్తున్న తనూజ .. మంచి మనసుకి హ్యాట్సాఫ్
Vijay | విజయ్ని చుట్టు ముట్టిన అభిమానులు.. ఒక్కసారిగా కింద పడిపోవడంతో..
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

